Crime News: మానవత్వానికి మాయని మచ్చ ఇది.. సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది.. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు.. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు పక్షవాతంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి పశువులా ప్రవర్తించాడు.
Land Dispute: భగ్గుమన్న భూవివాదం.. పరస్పర కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం
పక్షవాతంతో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం వేకువజామున మహారాష్ట్రలోని నాశిక్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు పక్షవాతం కారణంగా గత 7 ఏళ్లుగా మంచానికే పరిమితమై ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె బాగోగులను పొరుగున ఉన్న ఆమె సోదరుడు చూసుకుంటున్నాడు. అయితే మంగళవారం వేకువజామున 22 ఏళ్ల యువకుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం టీ ఇచ్చేందుకు వచ్చిన తన సోదరుడికి బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.