Land Dispute: in Uttarpradesh: బుధవారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో భూ వివాదంపై జరిగిన ఘర్షణలో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్క రామన్ గ్రామ పంచాయతీ గోవింద్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. మృతుల్లో ఒకరు సర్దార్ పరమవీర్ సింగ్, మరొకరు దేవేంద్ర సింగ్‌గా గుర్తించారు. మూడో బాధితుడు ఇంకా గుర్తించబడలేదు. మరో ముగ్గురు వ్యక్తులు కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
Ankita Bhandari Case: నిందితుడి నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలకు కోర్టు ఆమోదం
గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలను మోహరించినట్లు స్థానికులు తెలిపారు. రాయ్‌పూర్ హన్స్ గ్రామ పంచాయతీ మాజీ గ్రామాధికారి సురేష్ సింగ్ నేతృత్వంలోని బృందం మొదట కాల్పులు జరిపిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. భూమి స్వాధీనం విషయంలో మాజీ ప్రధాన్‌కు ముగ్గురు చనిపోయిన వారితో వివాదం ఉందని ఆయన చెప్పారు. ప్రతీకారంగా రెండో వర్గం కూడా కాల్పులు జరిపిందని ఆయన తెలిపారు. సురేష్‌సింగ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు తగిన బలగాలను రంగంలోకి దించగా, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.