వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు... వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ... రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం బుధవారం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం వితరణ చేసేందుకు సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చింది. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
Vizianagaram SP: విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ కాలనీలో దారుణం జరిగింది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణిని దొంగలు దారుణంగా చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Dog Attack: గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి.
92 Years Old Woman Climbe a Gate in China: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సరైన ‘ఫిట్‌నెస్’ లేదనే చెప్పాలి. తినే ఆహరం, జీవన శైలి కారణంగా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. దాంతో ఎక్కువ మంది 2-3 ఫ్లోర్లు ఎక్కితేనే అలసిపోతారు. స్టెప్స్ ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా భారీ గేటును సునాయాసంగా ఎక్కి పారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్…
నామ్నేర్ కూడలి వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి దగ్గరికి వచ్చిన ముగ్గురు యువకులు.. మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు వద్దని ఎంతా మొరాయిస్తున్న ఆ కామంధుడు వినలేదు. అయితే.. సమీపంలోని ఓ దుకాణంలో నిద్రిస్తున్న యువకుడు కేకలు విని లేచాడు. ఈ ఘటనకు పాల్పడుతున్న నిందితుల వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నామ్‌నేర్ కూడలిలోని కంట్రీ లిక్కర్ ఎదురుగా…
Old Woman Video Goes Viral in Memantha Siddham Bus Yatra: చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండలోను భారీగా జనాలు తరలివచ్చారు. దారిపొడవునా సీఎంకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఓ వృద్ధురాలు ‘జగనన్నే మళ్లీ రావాలి, మాకు జగనన్నే కావాలి’ అంటూ అరుస్తూ కనిపించారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి…