TVK Chief Vijay: ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత తరహాలోనే.. తన సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే, శివాజీ గణేషన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు తమ ప్రజాదరణను ఎన్నికల విజయంగా మార్చుకోలేకపోయినా, విజయ్ దళపతి మాత్రం ఈ పరంపరను చెరిపేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక, త్వరలో ఎన్నికలు సమీపంలో ఏఐఏడీఎంకేతో పొత్తు ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తుండటంతో టీవీకే చీఫ్ విజయ్ మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీపై విమర్శలు చేయలేదు. అయితే, ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు యాప్ ప్రారంభోత్సవంలో ఆయన డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్. అన్నాదురై వారసత్వాన్ని స్మరించుకున్నారు. ప్రజల దగ్గరకు వెళ్లండి, వారితో జీవించండి, వారి నుంచి నేర్చుకోండి, వారితో ప్రణాళిక వేయండి అనే అన్నాదురై సూత్రాన్ని పార్టీ కేడర్‌కు ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఇళ్లు, వీధి, గ్రామం అనే తేడా లేకుండా తిరుగుతూ అవిశ్రాంతంగా పనిచేయాలని టీవీకే కార్యకర్తలకు సూచించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా విజయ్ పర్యటనలు, సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది.
Read Also: War 2 Exclusive : కథ మార్పు.. మంచోడిగా ఎన్టీఆర్?
అయితే, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరితమైన లేఖ రాశారు. ఆగస్టు 21వ తేదీన మధురైలో జరగనున్న పార్టీ రెండవ రాష్ట్రస్థాయి సమావేశానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని మన రాజకీయ శత్రువులు (DMK), సైద్ధాంతిక శత్రువులు (BJP)పై పోరాడి గెలవడానికి ఒక నిర్ణయాత్మక అడుగుగా భావించాలని పేర్కొన్నారు. అలాగే, ఈ సమావేశం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ప్రధాన శక్తిగా ఎదుగుతుందన్నారు. అలాగే, ఈ మధురైలో జరిగే సమావేశం తర్వాత రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రచారానికి విజయ్ దళపతి సన్నాహాలు రచిస్తున్నారు.