Ajit Pawar Wife Oath Ceremony: మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ తొలి మహిళా డిప్యూటీ సీఎం కానున్నారు. ఆమె ఈరోజు ( జనవరి 31న) ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని ఎన్సీపీ (అజిత్) పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, సునేత్రాకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ముంబైలో ఇవాళ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకునే ఛాన్స్ ఉందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. సాయంత్రం వరకు ఆమె ఉపముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని పేర్కొన్నారు.
Read Also: Tragic Incident in Jangareddygudem: గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి..
అయితే, అజిత్ పవార్ ఆకస్మిక మృతి నేపథ్యంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీలిక వర్గాల పునరేకీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. చీలిక వర్గాల కలయికకు కసరత్తు కొనసాగుతున్న విషయం నిజమేనని, ఇందుకు సంబంధించి అజిత్ పవార్ జీవించి ఉండగానే జరిగిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పుణె, చించ్వాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పోటీ కూడా చేసేశాయి. రెండు చీలిక వర్గాలను విలీనం చేయాలని గత కొంతకాలంగా అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్‌తో అనేక సార్లు సమావేశం అయ్యారని సమాచారం. శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్‌తో కూడా చర్చలు కొనసాగించారు. బీజేపీ సీనియర్ నేతలకు ఈ విషయం తెలుసని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Off The Record: ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చగా మారిందా..?
ఇక, ఎన్సీపీ చీలిక వర్గాల పునరేకీకరణ జరిగితే వ్యవస్థాపక నాయకుడైన శరద్ పవార్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టి.. పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే పునరేకీకరణ ప్రయత్నాలకు మళ్లీ విఘాతం కలుగుతుందా?.. అప్పుడు విలీనం కోరుకుంటున్న నాయకుల వైఖరి ఎలా ఉంటుంది? అనేది వేచి చూడాలి.. సునేత్రా పవార్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ లేవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన అజిత్ పవార్ చనిపోయిన నేపథ్యంలో వచ్చే నెల శాసనసభ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 2026-27 బడ్జెట్ సమర్పించే ఛాన్స్ ఉంది.