Karur stampede: తమిళ స్టార్ యాక్టర్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే. తొక్కసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలు కోరడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
Karur stampede: చెన్నైతో పాటు తమిళనాడు అంతటా దీపావళి శోభ కనిపిస్తుంటే, తమిళ స్టార్‌కు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయం నిర్మానుష్యంగా కనిపించింది. ఇటీవల, విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. వీరి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ కేడర్లు అందరితో పాటు జిల్లా కార్యదర్శులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీవీకే కార్యాలయాల్లో చీకటి…
Karur Stampede: కరూర్ విజయ్ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక…
Tamil nadu: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 10 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు…
TVK Chief Vijay: ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత తరహాలోనే.. తన సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే, శివాజీ గణేషన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు తమ ప్రజాదరణను ఎన్నికల విజయంగా మార్చుకోలేకపోయినా, విజయ్ దళపతి మాత్రం ఈ పరంపరను…
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తలో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.
స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమె స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్లో ఉందని గతంలో తమిళ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ? ఆ పోస్ట్‌లో…
MRK Panneerselvam: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పై డీఎంకే మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టిక్కెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడు అని మండిపడ్డారు.
Tamil Nadu: ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిను తమిళక వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ కలవనున్నారు.