హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్రలో నటించిన తాజా చిత్రం “వార్ 2” యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించబడిన ఈ సినిమా, “వార్” సినిమాకి సీక్వల్‌గా సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా అందుతున్న ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ది విలన్ పాత్ర కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పోరాడే పాత్రలోనే కనిపిస్తాడు, కానీ విలన్ కాదని తెలుస్తోంది. నిజానికి మొదట అనుకున్న కథ వేరే అయినా సరే, సెట్స్ మీదకు వెళ్లాక మార్పులు, చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. హృతిక్ రోషన్ మొదట ఒప్పుకోకపోయినా, తర్వాత సినిమాలో మార్పులు, చేర్పులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
Also Read:Coolie Exclusive: ఆ ఒక్క మాట బయటకొస్తే చాలు.. అరాచకమే!
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలో టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అయితే, సెకండ్ హాఫ్ విషయంలో కాస్త అనుమానాలు ఉన్నాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయేలా డిజైన్ చేసుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే, నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని నమ్ముతున్నారు. ఇరవై నిమిషాల లోపే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, ప్రీ-ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సెట్ అయిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుందని, ఫ్యాన్స్‌కు ఫుల్ సాటిస్‌ఫైయింగ్ క్లైమాక్స్ రాసుకున్నారని అంటున్నారు.
Also Read:Coolie : ‘కూలీ’ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్.. కారణమేంటి?
మొత్తం మీద సినిమా టీం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమాతో మరోసారి ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ది విలన్ పాత్ర కాదని తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది.