SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబల బలైపోతుంది. తాజాగా తమిళనాడులో మరో ఘోరం జరిగింది. బైక్ టాక్సీపై వెళ్తున్న మహిళను అమాంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బైక్ వదిలేసి పరారైపోయాడు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే అధికార డీఎంకే, తమిళ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. డీఎంకే ప్రవేశ పెట్టిన ఈ బిల్లులో తమిళనాడు రాష్ట్రంలో హిందీని నిషేధించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనీ ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. ఈ బిల్లులో ప్రధాణంగా తమిళనాడు అంతటా హిందీ హోర్డింగ్లు, బోర్డులు,…
మహిళలపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా డీఎంకేను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
తమిళ సినీ సూపర్స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు…
TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. టీవీకే పార్టీ మానాడు కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళనాడులో సింహం వేట మొదలైంది. ఇక నుంచి రణరంగమే జరుగుతుంది. తమిళనాడులోని ప్రతి ఇంటి డోర్ కొడుతాం. అందరినీ కలుపుకునిపోతాం. ఏ పార్టీతోనూ మేం చేతులు కలపం. ఒంటరిగానే పోరాడుతాం.…
TVK Chief Vijay: ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత తరహాలోనే.. తన సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే, శివాజీ గణేషన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు తమ ప్రజాదరణను ఎన్నికల విజయంగా మార్చుకోలేకపోయినా, విజయ్ దళపతి మాత్రం ఈ పరంపరను…