జార్ఖండ్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. ఈనెల 13న జరిగిన తొలి విడతలో కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. బుధవారం జరిగిన రెండో విడతలో కూడా అదే మాదిరిగా పోలింగ్ నమోదైనట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Trump: పందెంలో ఓడిపోయిన వ్యక్తికే ట్రంప్ అందలం.. వీడియో వైరల్
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్ 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరిగింది. ఇక్కడ ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Thala Teaser: వామ్మో.. భయపెడుతున్న “తల” టీజర్.. హీరోగా మరో వారసుడు ఎంట్రీ