Thala Teaser: వామ్మో.. భయపెడుతున్న “తల” టీజర్.. హీరోగా మరో వారసుడు ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న నిర్మాత ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ “తల” అనే కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “తల” చిత్రానికి ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ రోజు తల సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ క్రమంలో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు ఈ తలా సినిమా అంతే ఇంపార్టెంట్. ఆర్బీ చౌదరి నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది.
Kollywood : తమిళ సెలబ్రిటీల వరుస విడాకులు.. ఎందుకంటే?
Also Read
తల లాంటి డిఫరెంట్ స్టోరీని యాక్సెప్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు ఆర్బీ చౌదరికి కృతజ్ఞతలు చెబుతున్నా, ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఉన్న సినిమా మాది. త్వరలోనే గ్రాండ్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ నేను హీరోగా మారినప్పటి నుంచే ప్రేక్షకులే నాకు అన్నీ అనుకున్నా, వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటారో అలా ఉంటా. నాన్న తల మూవీ కథ చెప్పినప్పుడు సినిమా, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో నేను మనసులో ఊహించుకున్నా, రోజూ నా క్యారెక్టర్ లోనే ఉండిపోయేవాడిని. తల సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయదల్చుకోలేదు, తప్పకుండా మీరంతా థ్రిల్ అయ్యేలా సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమాలో అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రావణ్, తదితరులు నటిస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..