Congress: కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్‌కి పాకిస్తాన్ భూభాగంగా చూపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ రుణాన్ని ఆపడంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం విఫలమైందని విమర్శించడానికి, కాంగ్రెస్ ఈ ఫోటోని షేర్ చేసింది. దీనిపై వెంటనే నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, ఆ తర్వాత దీనిని డిలీట్ చేసింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే 1బిలియన్ డాలర్ల రుణాన్ని ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కి అందించింది.
Read Also: Srisailam Dam: ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్..! మరమ్మతులు చేస్తారా..?
అయితే, ఈ వివాదంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక తీవ్రంగా కాంగ్రెస్‌ని విమర్శించారు. కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి చెందినదిగా చూపించడంపై ‘‘పాపాత్మక పాకిస్తాన్ పట్ల తన కాంగ్రెస్ తన అభిమానాన్ని ప్రదర్శించింది’’ అని ఎద్దేవా చేశారు. మొత్తం మీద, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ పాకిస్తాన్ ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఈ పొరపాటుపై కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ‘‘ఇది చిన్న తప్పు. మేము పోస్ట్‌ని తొలగించాము.’’ అని చెప్పారు. పదేపదే కాంగ్రెస్ పోస్టులు వివాదాస్పదం కావడం గురించి ప్రశ్నించిన సమయంలో, పోస్టులకు కారణమైన వారిని తొలగించినట్లు చెప్పారు.