Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్…
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు.
అస్సాంలోని కాకోపథర్‌లోని భారత ఆర్మీ శిబిరంపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం.. ఆకస్మిక దాడిని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ULFA-ఇండిపెండెంట్) సంయుక్త బృందం నిర్వహించాయి. ఈ రెండూ కూడా నిషేధిత తిరుగుబాటు సంస్థలు.
అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. ఏ ఒక్కరికైనా భయాందోళనలు సహజం. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం వృత్తికి తగినట్టుగా తమ బాధ్యతలు నెరవేర్చి శెభాష్ అనిపించుకుంటున్నారు.
Spider Bite: తూర్పు అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టిన్సుకియా జిల్లా పనిటోలా గ్రామంలో ఏడేళ్ల బాలిక సాలీడు (Spider) కాటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పిల్లలు ఆడుకుంటుండగా.. ఆ చిన్నారి గుడ్లు ఉన్న ఓ వెదురు బుట్టలో ఉన్న గుడ్ల కోసం తెరిచింది. ఆలా తెరవగానే ఆ బుట్టలో ఉన్న నల్లటి సాలీడు చిన్నారి చేతిపై కొరికింది. దీంతో చిన్నారి చేయి వెంటనే…
అస్సాంలో దారుణం జరిగింది. నకిలీ బిల్లులు క్లియర్ చేసే విషయంలో పై అధికారుల నుంచి అధిక ఒత్తిడి రావడంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PwD)లో అసిస్టెంట్ ఇంజనీర్(30)గా పని చేస్తున్న మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Woman kills husband: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య, తన భర్తను హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. ఈ కేసులో 38 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు రహిమా ఖాతున్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని సబియాల్ రెహమాన్(40)గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా స్క్రాప్ డీలర్. రహిమా, తన భర్త సబియాల్ని జూన్ 26న హత్య చేసింది.