Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ, అస్సాం కాంగ్రెస్ చీఫ్ అయిన గౌరవ్ గొగోయ్‌పై మరోసారి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ ఏజెంట్ ముందు రాష్ట్రంలోని ప్రజలు తలవంచరని ఆదివారం ఆయన అన్నారు. కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో హిమంత మాట్లాడుతూ.. అస్సామీలు పాకిస్తానీ ఏజెంట్ ముందు తలవంచరని, ఏ అపరిచితుడి ముందు కూడా తలవంచరని, తాము బటద్రవ థాన్‌ను ఆక్రమణదారుల నుంచి విముక్తి…
Himanta Sarma: ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర గందగోళానికి దారి తీసింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మెస్సీ 'GOAT టూర్ 2025' గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత.
Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్…
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు.
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు. ‘‘మదానీ ఎవరు..? ఆయన దేవుడా..? మదానీ ధైర్యం అంతా కాంగ్రెస్ సమయంలో మాత్రమే, బీజేపీతో కాదు. ఆయన పరిమితులు దాటితే జైలులో పెడతాను, నేను సీఎంను, మదానీ కాదు. నేను మదానీకి…
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
Himanta Biswa Sarma: పాకిస్తాన్‌ని అణ్వాయుధ దేశం మారేందుకు కాంగ్రెస్ చేసిన ‘‘చారిత్రక తప్పిందాలు’’ కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. పాకిస్తాన్ తాను చేస్తున్న ఉగ్రవాదానికి, పరోక్ష యుద్ధానికి ‘‘అణు బ్లాక్మెయిల్’’ని వాడుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం, చాలా దేశాలు అణు బెదిరింపులను తటస్థీకరించేందుకు నిర్ణయాత్మంగా వ్యవహరిస్తున్న సమయంలో, 1980లలో భారత నాయకత్వం పాకిస్తాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు.
Sharmistha Panoli: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివాదాస్పద పోస్ట్ పెట్టిన తర్వాత, ఇన్ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారనే ఆరోపణలపై ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పనోలికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.