Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్.. ఎందుకో తెలుసా?
- ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్
- ఫ్లైఓవర్ నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియలో జాప్యం
- ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్న మంత్రి
- భూసేకరణ జాప్యం అంశంపై అధికారులపై కేంద్ర మంత్రి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కోసం భూమి సేకరణ ప్రక్రియలో జాప్యం అవుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలా వెంటనే భూమి సేకరణ పూర్తిచేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మితమైన అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.
READ MORE: Allu Arjun: ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అంటున్న అల్లు అర్జున్.. అసలు మ్యాటరేంటంటే?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా.. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ అని.. అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ కీలకమని తెలిపారు. నిధుల కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ వంటి సమస్యలు బస్తీల్లో రొటీన్ అయ్యాయన్నారు.
READ MORE: Jagga Reddy: కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు..
నగరంలో అవసరమైన ప్రతిచోట స్ట్రీట్ లైట్స్, రీస్టోరేషన్ తక్షణ చర్యలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సమాన దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అప్జల్‌గంజ్ వరకే పరిమితమైన ఫస్ట్ ఫేజ్‌ను విస్తరించాలన్నారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్‌ల కోసం ప్రతిపాదనలు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పంపించాలన్నారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!