Gold Price: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త ఒకటి అందింది. శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. అటు ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, ముంబైలలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 370 పతనంతో రూ. 55,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.430 పతనంతో రూ.60,370 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పతనంతో రూ. 55,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పతనంతో రూ. 60,710 .
Read Also: Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 400 పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220గా ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది.
Read Also: Tamilnadu: హైడ్రోజన్ ఫ్యూయల్ బోట్‌ను రూపొందించిన విద్యార్థులు
అటు బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పతనంతో రూ. 55,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 77,700గా రేట్లు ఉన్నాయి. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,220. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 60,220. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలో కేజీ రూ. 73,400, చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,700 ధరలుగా ఉన్నాయి.