కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. ఈరోజు చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఖుర్షీద్‌కు సీఎం అవార్డును అందించారు. అవార్డు అందుకున్న అనంతరం సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకం అని, తన జీవితంలో దీనికి మించిన అవార్డు…
Salman Khurshid: కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరుగా ఉందనే భావనను చాలా కాలం సృష్టించిందని, ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పలు దేశాలకు భారత దౌత్య బృందాలు వెళ్లాయి.
ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపించారు.
BJP: బంగ్లాదేశ్ అల్లర్లు, హింసను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, భారత్‌లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు
Salman Khurshid: కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇండియాలో కూడా ‘‘బంగ్లాదేశ్ పరిస్థితులు’’ రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మంగళవారం ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘‘బయటకు ప్రతీది సాధారణంగా కనిపించొచ్చు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో అది భారత్‌లో కూడా జరగొచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Rahul Gandhi not Ram, but BJP on Ravan's path says Salman Khurshid: రాహుల్ గాంధీని శ్రీ రాముడితో పోల్చి వివాదం రేపారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. దీనిపై విమర్శలు రావడంత తన ఉద్దేశాన్ని బుధవారం మరోసారి తెలిపారు. రాహుల్ గాంధీ రాముడు కాదని.. కానీ రాముడు చూపిన మార్గంలో నడుస్తున్నారని.. బీజేపీ మాత్రం రావణుడి బాటలో నడుస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కొత్త పుస్తకంపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనోభావాలను దెబ్బతీస్తే, ప్రజలు ఇంకేదైనా చదవాలని పేర్కొంది. కోర్టు పిటిషనర్‌తో, “ప్రజలను కొనుగోలు చేయవద్దని లేదా చదవవద్దని మీరు ఎందుకు అడగరు? పుస్తకం తప్పుగా రచించబడిందని దానిని చదవవద్దని అందరికీ చెప్పండి. మనోభావాలు దెబ్బతింటుంటే, వారు ఇంకేదైనా చదువుతారని కోర్టు పేర్కొంది. కాగా, ఈ పుస్తకం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై నిషేధం విధించాలని, వాక్, భావప్రకటనా స్వేచ్ఛను…
అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆయన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా హిందూత్వాన్ని ర్యాడికల్ ఇస్లాంతో పోల్చడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు సల్మాన్ ఖుర్షీద్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు నైనిటాల్‌లోని సల్మాన్ ఖుర్షీద్ నివాసానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఆయన ఇంటి అద్దాలు పగులగొట్టి, తలుపులకు నిప్పుపెట్టారు. అయితే దుండగులు తన ఇంటిపై దాడి చేసిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ నేత…
కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. యూపీ రాజకీయాలు వేడెక్కాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ప్రియాంకగాంధీ నాయకత్వంలో.. ఎలక్షన్స్ వెళ్లాలని నిర్ణయించింది. ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనీ.. సల్మాన్ ఖుర్షీద్…