Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై అగ్నిమాపక శాఖ స్పందించింది. ఈ సందర్భంగా ఫైర్ డీఎఫ్ఓ వెంకన్న మాట్లాడుతూ.. మాకు ఫోన్ కాల్ వచ్చిన ఒకటిన్నర నిమిషంలో సంఘటన స్థలానికి చేరుకున్నాం.. ఫైర్ ఇంజన్లో పూర్తిస్థాయి అధునాతన పరికరాలు ఉన్నాయి.. ఫైర్ ఇంజన్లో 4,500 లీటర్ల నీరు ఎప్పుటికి నిల్వ ఉంటుంది.. ముందు మంటలు ఆర్పేసిన తర్వాత లోపలికి వెళ్లి బాధితులని రెస్క్యూ చేశాం.. దట్టమైన పొగలు మంటలు వస్తుండటంతో వాటిని ఆర్పే ప్రయత్నం ముందుగా చేశాం.. భవనం పైనుంచి మరికొన్ని టీంలు లోపలికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. భవనం లోపలికి వెళ్ళేందుకు ఎక్కడ నుంచి అవకాశం లేకుండా పోయింది.. వెనుక నుంచి ముందు భాగం నుంచి గోడలను పగల కొట్టి ప్రజలు లోపలికి వెళ్లడం జరిగింది డీఎఫ్ఓ వెంకన్న అన్నారు.
Read Also: బ్లాక్ డ్రెస్సులో స్రవంతి హాట్ ట్రీట్.. చూసి తట్టుకోవడం కష్టమే!
అయితే, బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తూనే మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశామని అగ్నిమాపక శాఖ డీఎఫ్ఓ వెంకన్న చెప్పుకొచ్చారు. మా ప్రాణాలను ప్రాణంగా పెట్టి గుల్జార్ హౌస్ లో రిస్క్యూ ఆపరేషన్ చేశాం.. గుల్జార్ హౌస్ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం మాకు బాదేసింది.. బాధితులను కాపాడేందుకే మేము నిత్యం ప్రయత్నం చేస్తాం.. మా శాఖ నుంచి ఎలాంటి నిర్లక్ష్య ధోరణి అవలంబించ లేదు అని వెల్లడించారు.