దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
రాష్ట్రంలో కోవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్.. రాష్ట్రంలో ఈ మధ్య ముగ్గురు మృతిచెందారన్న ప్రచారంపై స్పందించిన ఆయన.. వివరణ ఇచ్చారు.
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు…
ఇండియాలో కరోనా ప్రభావం బాగా తగ్గింది. ఇవాళ ఇండియాలో భారీగా తగ్గాయి కరోనా పాజిటివ్ కేసులు. 7,554 కొత్త కేసులు నమోదయ్యాయి. 223 మరణాలు నమోదయ్యాయి. 14,123 రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటిన్ తెలిపింది. యాక్టివ్ కేసులు 85,680గా వున్నాయి. సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గగా.. మంగళవారం స్వల్పంగా పెరిగింది. నిన్నటికంటే 9శాతం కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 0.90 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్…
రెండేళ్ళకు పైగా ప్రపంచాన్ని వణికించింది చిన్న వైరస్. గతంలో ఎన్నడూ లేని విధంగా మృత్యుఘంటికలు మోగించిన కోవిడ్ కథ ముగిసిందా. ఈ వైరస్ అప్పుడే అంతం కాలేదని స్పష్టం చేసింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా తగ్గింది కదా అని ఏమాత్రం లైట్ తీస్కోవద్దని హెచ్చరించింది. కరోనా శాశ్వతంగా ఇకపై మనతోనే ఉండనుందా? ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా కథ ముగిసిందని.. మహమ్మారి ఎండెమిక్‌గా మారినట్టు తెలిపింది. అయితే…
భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల…
భారత్లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర…
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. రోజూ వారి కేసుల సంఖ్య పదకొండు లక్షలకు చేరడంతో.. నివారించే మార్గం కానరాక అమెరికా తల్లడిల్లుతోంది. రోజు లక్షన్నర మందికి పైగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుండడంతో.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆరోగ్యరంగం సతమతమవుతోంది. రోజువారీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బైడెన్ ప్రభుత్వం ఆర్మీ…
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేలు పరిహారం ఇస్తోంది. గత ఏడాది నవంబరులో తొలి విడతలో 3,870 దరఖాస్తులు రాగా డిసెంబరులో వాటిని ఆమోదించి ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇంకా బాధిత కుటుంబాలు ఉంటే పరిహారం అందుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలు పరిహారం కోసం మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విప్తతు నిర్వహణ శాఖ సూచించింది. Read…
దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం…