కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా.. దాదాపు వారం తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్.. ఈ సాయంత్రం సర్ గంగారామ్ ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారని మరియు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు జైరాం రమేష్.
Read Also: Noodles: బాలుడి ప్రాణం తీసిన నూడిల్స్.. అదే కొంప ముంచిది..!
కాగా, 75 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 2న కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్ధించబడ్డారు.. తర్వాత కోలుకున్నా.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందికి గురైన ఆమె.. గత వారం ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యపరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉండడంతో.. తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇప్పటికే సోనియా గాంధీకి నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.. ఆస్పత్రిలో ఉన్నకారణంగా.. విచారణకు హాజరుకాలేకపోతున్నానంటూ తెలిపారు. మరి ఇప్పుడు ఇంటికి చేరుకోవడంతో.. ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఇదే కేసులో రాహుల్ గాంధీని వరుసగా విచారిస్తున్నారు ఈడీ అధికారులు.. ప్రతీరోజూ సుదీర్ఘంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక, రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ అధికారులు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.