నూడిల్స్ ఓ బాలుడు ప్రాణాలు తీశాయి.. ఎంతో ఇష్టంగా తన కుమారుడికి నూడిల్స్ పెట్టింది ఆ తల్లి.. అవి తిన్న కాసేపటికే ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కకపోవడం విషాదంగా మారింది.. తమిళనాడులో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన శేఖర్-మహాలక్ష్మి దంపతులకు.. రెండేళ్ల బాలుడు ఉన్నాడు.. అయితే, కొంత కాలంగా ఆ బాలుడు అలెర్జీతో బాధపడుతున్నారు.. వైద్యునికి చూయించి తగిన చికిత్స అందిస్తున్నారు.. ఇదే సమయంలో నూడిల్స్ తిని అస్వస్థతకు గురయ్యాడు.
Read Also: CM YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక వ్యాఖ్యలు
శుక్రవారం రాత్రి సమయంలో నూడిల్స్ చేసిన తల్లి.. ఆ బాలుడికి పెట్టింది.. మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు ఉదయం ఆ రెండేళ్ల బాలుడికి ఆహారంగా పెట్టింది.. అయితే, అవి తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు సదరు బాలుడు.. వాంతులు చేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ, అప్పటికే బాలుడు మృతిచెందినట్టు నిర్ధారించారు వైద్యులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు.. మరి బాలుడి మృతికి కారణం ఏంటి? నూడిల్స్ ఆ బాలుడు ప్రాణాలు తీశాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుందని చెబుతున్నారు పోలీసులు.