Pregnant Woman in Doli: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ఇంకా కొన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా కుక్కునూరు ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు ఏజెన్సీ గ్రామాలకు.. కుక్కునూరు మండలం జిన్నలగూడెం ఏజెన్సీ గ్రామంలో ఇరుమమ్మ అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది.. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఇరుమమ్మ ను మంచానికి డోలి కట్టి మూడు కిలోమీటర్లు అర్ధ…
Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్ నగర శివారులో కల్లుకు అలవాటు పడిన పలువురు మత్తు కల్లు దొరక్క పోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో 10 మందిని వారి బంధువులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ లో చేర్పించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (జూలై 2న) తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్ లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు ఆసుపత్రి వైద్యుల బృందం పేర్కొన్నారు. అలాగే, సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆస్పత్రి…
KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
పోప్ ఫ్రాన్సిస్(88)కు చెందిన తాజా ఫొటోను వాటికన్ విడుదల చేసింది. ఆస్పత్రిలో ఉన్న ఫొటోను ఆదివారం విడుదల చేసింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన బాహ్య ప్రపంచానికి కనబడలేదు. తాజాగా పోప్‌కు సంబంధించిన ఫొటో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే వైద్యులు.. పలు రకాలైన టెస్టులు నిర్వహించారు. అనంతరం న్యుమోనియాకు డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వాటికన్ తెలిపింది. ఇది కూడా చదవండి:…
First GBS Death In AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరఓలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాదితో చికిత్స సోకడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది.
సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు వైద్య వర్గాలు శనివారం తెలిపాయి.
దల్లేవాల్కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయి.. కనీసం ఐవీ ఫ్లూయిడ్స్‌నైనా ఇవ్వడానికి అవకాశం రావడం లేదని సుప్రీంకోర్టు ముందు పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రభుత్వం విన్నపం మేరకు కోర్టు మరో మూడు రోజుల గడువు ఇచ్చిందని పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ వెల్లడించారు.
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి…