Al Falah University: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న 32 కార్లతో భారీ దాడులు చేయాలని ఉగ్ర డాక్టర్లు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు, ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న హర్యానా ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు పడింది. ఈ యూనివర్సిటీ నిధులపై దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి…
మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. వీరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మాజీ క్రికెటర్లు ఇద్దరూ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet ను ప్రోత్సహించారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ 1xBet పై కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్ కు…
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో రానా ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకి ఆయనను ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ED ఆదేశించింది. ఈ రోజు (జులై 23, 2025) ED ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, రానా సమయం కోరడంతో మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. బెట్టింగ్ యాప్స్‌తో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేస్తోంది.…
ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నలుగురు సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. Also Read : Samantha: నిర్మాత, హీరోయిన్గా సినిమా ఫైనల్ చేసిన సమంత? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న,…
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..
Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ ను ఈ రోజు ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపింది. అసలు సడెన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది.. ఆ స్కామ్ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ ఒకటే రూమర్లు తెరమీదకు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. “నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నాను. కానీ కొన్న తర్వాత అతని మీద…