Chhattisgarh Encounter: దేశంలో నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్‌లో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. చింద్‌ఖరక్ అడవిలో భద్రతా దళాలు ముగ్గురు నక్సలైట్లను హతమార్చాయి. మృతి చెందిన ముగ్గురు నక్సలైట్లపై రూ.1.4 మిలియన్ల రివార్డ్ ఉంది. కాంకేర్-గారియాబంద్ DRG, BSF దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య సుదీర్ఘమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
పరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవులలో మావోల ఏరివేత వేగవంతంగా జరుగుతుంది. అటు పోలీసులు, ఇటు మావోలు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్‌లో మావో సుప్రీం కమాండర్ నంబాలకేశ్వరరావు మృతి చెందటంతో మావోలు ప్రతీకార చర్య చేపడతారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్ పరిసర జిల్లాల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఏలూరు జిల్లాలోని పోలవరం అటవీ ప్రాంతంతో పాటు పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పోలవరం ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్న భద్రత దళాల్లోని…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ మధు, మావోయిస్టు పత్రిక జంగ్ ఎడిటర్ నవీన్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోలు హతమయ్యారు. ఇందులో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్నా హతమయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో అడవులు దద్దరిల్లాయి. మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు బుధవారం కూడా మావోల కోసం జల్లెడ పట్టాయి. దీంతో నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోలు ఎదురుపడ్డారు.