Bijapur Encounter: బీజాపూర్-దంతేవాడ అంతర్- జిల్లా సరిహద్దులోని పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టు కేడర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Maoist Ceasefire: ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్‌కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్‌కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
బీజాపూర్‌లో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో నక్సలైట్లు మరో హత్యకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుడిని హత్య చేశారు మావోయిస్టులు. కళ్ళు తాటి తోడ్కా అనే ఉపాధ్యాయుడుని గంగలూర్ ప్రాంతంలోని నేంద్రలో డ్యూటీ వేశారు.. నిన్న సాయంత్రం, పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా, నక్సలైట్లు అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిచిన కారణంగా ఈ హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది పోలీస్ ఇన్ ఫార్ములా పేరిట హత్య చేసినట్లుగా…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
పరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక 20 మంది మావోల్లో 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహదుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నక్సలైట్లు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రన్న తలపై ఇప్పటికే రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.
నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు 'నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్కౌంటర్లో ముందుగా నలుగురు చనిపోగా.. ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ…