CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు.
Maoists Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
పరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి.
బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు.