Sai Durga Tej : సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టేశాడు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అలాగే టాలీవుడ్ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. తాజాగా ఆయనకు మరో అవార్డు వరించింది. యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. స్టైలిష్ గా ఉండాలంటే చాలా పీస్ ఫుల్ గా జీవిస్తే చాలు.. ముఖంలో ఆ అందం ఆటోమేటిక్ గా తెలుస్తుంది అన్నారు.
Read Also : Divya Nagesh : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ..
ఇక తెలుగులో స్టైలిష్ యాక్టర్ ఎవరు అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రామ్ చరణ్ స్టైలిష్ యాక్టర్ అన్నాడు సాయితేజ్. అలాగే పవన్ కల్యాణ్ కూడా మరో స్టైలిష్ యాక్టర్ అంటూ కితాబిచ్చేశాడు. మొత్తానికి మెగా హీరోలే తనకు స్టైలిష్ యాక్టర్లు అంటూ తేల్చేశాడు సాయితేజ్. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు మూవీతో బిజీగా ఉంటున్నాడు సాయితేజ్. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు రానటువంటి కొత్త కథతో వస్తున్నామని ఇప్పటికే మూవీ టీమ్ చెప్పింది. ఇందులో సాయితేజ్ లుక్ కూడా సంచలనం రేపింది.
Read Also : Kiara : నువ్వు నా ప్రపంచానే మార్చేశావ్.. కియారా పోస్ట్ వైరల్