Divya Nagesh : అనుష్క హీరోయిన్ గా చేసిన అరుంధతి ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అరుంధతి చిన్నప్పటి జేజమ్మ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్. ఆ జేజమ్మ పాత్రలో నటించింది దివ్య నగేశ్. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో మూవీల్లో నటించింది. కానీ ఇప్పటికీ జేజమ్మ అంటేనే ఆమెను ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఆమె తెలుగు మూలాలున్న అమ్మాయి. అపరిచితుడు, సింగం పులి లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం డ్యాన్సర్ గా, మోడల్ గా చేస్తోంది. ఆమె కోలీవుడ్ లో చాలా సినిమాల్లోనే వర్క్ చేస్తోంది.
Read Also : Kiara : నువ్వు నా ప్రపంచానే మార్చేశావ్.. కియారా పోస్ట్ వైరల్
కొన్నేళ్లుగా తన తోటి కొరియోగ్రాఫర్, నటుడు అజయ్ కుమార్ తో డేటింగ్ లో ఉంది. గత జనవరిలో వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆగస్టు 18న పెళ్లి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్ తో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా.. అనుష్క సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన వారికి కూడా పెళ్లి అవుతోంది.. కానీ అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనుష్క ఘాటీ సినిమాతో థియేటర్లలోకి రాబోతోంది.
Read Also : Mega Heros : ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో..!