Kiara : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ నడుమ ట్రెండింగ్ లో ఉంటుంది. రీసెంట్ గానే కియారా, సిద్దార్థ్ జంటకు ఓ పండంటి పాప జన్మించింది. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా.. ఇప్పుడు పాపతోనే గడుపుతోంది. ఇప్పుడు ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ.. తన కూతురుతో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా తన కూతురు గురించి రాసుకొచ్చింది. ‘నేను నీ డైపర్లు మారుస్తుంటే నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశావ్. ఈ డీల్ బాగుంది’ అంటూ రాసుకొచ్చింది ఈ భామ.
Read Also : Tollywood : ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..
ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తెలుగులో చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించింది. అలాగే యష్ తో చేస్తున్న టాక్సిక్ మూవీలో మెరిసింది. ఇప్పుడు హృతిక్, తారక్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాలోనూ నటిస్తోంది. రీసెంట్ గానే వచ్చిన సాంగ్ లో కియారా బికినీ షాట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆమె కెరీర్ లో ఫస్ట్ టైమ్ మూవీ కోసం బికినీ వేసింది. ఇందులో ఆమె యమ హాట్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి వార్-2 ప్రమోషన్లకు వస్తుందా రాదా అన్నది ఇంకా డౌట్ గానే ఉది. అటు సిద్దార్థ్ కూడా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు.
Read Also : Mega Heros : ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో..!