Rama Banam: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది. దీంతో తనకు ఇండస్ట్రీలో హిట్లు ఇచ్చి స్టార్ హీరోగా నిలబెట్టిన డైరెక్టర్ శ్రీవాస్ నే గోపీచంద్ నమ్ముకున్నాడు. లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలతో హిట్ కాంబో అనిపించుకున్న గోపీచంద్- శ్రీవాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న తాజాగా చిత్రం రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి నటిస్తుండగా జగపతి బాబు, కుష్బూ ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఇక నేడు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపీచంద్ ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Dhanush: నా భార్య నన్ను ఎప్పుడు మెచ్చుకోలేదు..
లక్ష్యం, లౌక్యం సినిమాలలో లానే ఈ సినిమాలో కూడా గోపీచంద్ యాక్షన్ అదరగొట్టేశాడు. ఫిరత్ లుక్ టీజర్ మొత్తాన్ని గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్ లతో నింపేశాడు డైరెక్టర్.. ఈ చిత్రంలో విక్కీ అనే పాత్రలో గోపీచంద్ కనిపించనున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో వైలెంట్ గా రామబాణం విసురుతున్నట్లు గోపీచంద్ కనిపించాడు. చుట్టూ పడిపోయిన రౌడీలు వారి మధ్యలో చేతిలో ఉన్న ఆయుధంతో వారిని చితకొడుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్ చూస్తుంటేనే ఇదో మాస్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా గా తెలుస్తోంది మరోపక్క మొదటి నుంచి గోపీచంద్ సెంటిమెంట్ టైటిల్ లో చివరి అక్షరం సున్నా ఉంటే అది హిట్.. ఈ విషయం తెల్సిన బాలయ్య.. అన్ స్టాపబుల్ కు వచ్చిన గోపీచంద్ కు రామ బాణం అనే టైటిల్ ను సజిస్ట్ చేయడం.. దాన్నే గోపీచంద్ సీరియస్ గా తీసుకొని టైటిల్ గా పెట్టేశాడు. మరి ఈసారైనా ఈ రామబాణం ప్రేక్షకులకు గుచ్చుకుంటుందా..? గోపీచంద్ హిట్ అందుకుంటాడా..? ఈ కాంబో హ్యాట్రిక్ కొడుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.