Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బిటెక్ సినిమాతో తెలుగువారికి సుపరిచితుడిగా మారిపోయాడు. ఇక చాలా ఏళ్ళ తరువాత సార్ సినిమాతో తెలుగులో స్ట్రైట్ సినిమాతో వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక సినిమా విషయాలు పక్కన పెడితే ధనుష్.. తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 18 ఏళ్ళ వైవాహిక బంధానికి గతేడాది ముగింపు పలికారు. అయితే ఈ జంట కొన్ని కారణాల వలన విడిపోయారని, పెద్దలు వీరితో మాట్లాడి తిరిగి కలిపే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం. ఇక భార్యాభర్తలుగా తాము విడిపోయినా పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను అందిస్తున్నట్లు వారు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే పిల్లల కోసం వారు అప్పుడప్పుడు కలిసి కనిపిస్తూనే ఉన్నారు.
Hansika Motwani: అది పెరగడానికి ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక.. ?
ఇక సార్ ప్రమోషన్స్ లో భాగంగా ధనుష్ ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒక తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ తన భార్య ఐశ్వర్య గురించి మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ధనుష్- ఐశ్వర్య కలిసే ఉన్నారు. మీ సినిమాలు చూసి మీ మామగారు రజినీకాంత్, భార్య ఐశ్వర్య ఏమంటారు.. ప్రశంసిస్తారా..? అన్న ప్రశ్నకు ధనుష్ మాట్లాడుతూ.. ” రజినీకాంత్ గారికి సినిమా నచ్చితే.. చిన్నా పెద్ద.. కొత్త, పాత అనే బేధాలు ఏమి ఉండవు. ఇంటికి పిలిచి ప్రశంసిస్తారు. నేను అలాంటి ప్రశంసను నా రెండో సినిమాకే అందుకున్నాను. నన్ను ఆయన పిలిచి మరీ ప్రశంసించారు. అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం అది. ఇక నా భార్య ఐశ్వర్య విషయానికొస్తే రజినీకాంత్ గారికి పూర్తి విరుద్ధం… నా కుటుంబంలో మా అన్న, వదిన, ఐశ్వర్య ఒకేలా ఉంటారు. నేను ఎంత బాగా చేసినా ఆమె మెచ్చుకోదు.. ఓకే, బావుంది, నైస్ అని చెప్పేస్తోంది. ఏ అవార్డులు అయినా రానీ, ఎంత మంచిగా అయినా చేయని చాలా బ్యాలెన్స్డ్ గా చెప్తుంది. నన్ను చూసి ఆమె చాలా ప్రౌడ్ ఫీల్ అవుతోంది. కానీ, ప్రశంసలు లాంటివి చేయదు” అని చెప్పుకొచ్చాడు. ఒక సినిమా నటుడుకు ప్రశంస ఎంతో ముఖ్యమైంది, దానివలన మనం ఏం నేర్చుకున్నాం.. ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది అని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.