పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమై కొద్దిరోజుల్లోనే అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడుకి ఇప్పుడు తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఎంత త్వరగా తెలుగులో మార్కెట్ వచ్చిందో అంతే త్వరగా తన ఫేమ్ కూడా పోగొట్టుకుంది అని చెప్పాలి. కాగా పూజా హెగ్డే దాదాపు రెండున్నరేళ్ల నుంచి తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇక ఇలా తెలుగు సహా సౌత్ సినిమాల్లో కనుమరుగు అయిపోయింది అనుకున్న పూజా హెగ్డే, మళ్ళీ ఇపుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టింది
Also Read:Mega 157: చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ లో వెంకటేష్ గెస్ట్ రోల్ ?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘రెట్రో’ లో హీరోయిన్ గా కనిపిస్తుంది. అలాగే, రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ మూవీలో కూడా నటించనున్నట్లు సమాచారం. అలాగే హిందీలో కూడా ఓ మూవీ చేస్తోంది. అయితే అవకాశాలు వచ్చాయి కానీ అవి ఎంతవరకు హిట్ అనేది విడుదల అయిన తర్వాత తెలుస్తుంది. దీంతో తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ కోసం ప్రత్యేక పూజలో పాల్గొంటుంది. తాజాగా ఇవాళ పూజా హెగ్డే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్ని స్వామి, అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు శేష వస్త్రం తో సత్కరించి, వేద ఆశీర్వచనాలు… తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.