Nithin : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ వశిష్ట తండ్రి నిర్మాత సత్యనారాయణరెడ్డి. ఈయన గతంలో ఢీ, బన్నీ, భగీరథ లాంటి సినిమాలు తీశారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా కొడుకు వశిష్టకు డైరెక్షన్ అంటే ఇష్టమని నితిన్ తో సినిమా చేద్దాం అన్నాను. ఓ ప్రొడ్యూసర్ ను కూడా నేను సెట్ చేసుకున్నా. ఆ ప్రొడ్యూసర్ తో నితిన్ కు రూ.75లక్షలు అడ్వాన్స్ కూడా ఇప్పించాను. కెమెరా మెన్ చోటా కే నాయుడుకు రూ.10 లక్షలు ఇప్పించాను. సినిమా మీద రూ.2 కోట్లు ఖర్చు చేశాం. కానీ నితిన్ మాతో చేయను అని హ్యాండ్ ఇచ్చాడు’ అంటూ చెప్పాడు సత్యనారాయణరెడ్డి.
Read Also : Rajamouli : ఆ మూడు సినిమాల కోసం వెయిట్ చేస్తున్న రాజమౌళి..
‘ఆ టైమ్ లో అఆ రిలీజై పెద్ద హిట్ కావడంతో.. వశిష్టతో చేస్తే రేంజ్ పడిపోతుందని వద్దన్నాడు. అప్పుడు చాలా బాధేసింది. ఆ తర్వాత శిరీష్ తో సినిమా చేద్దాం అనుకున్నాం. శిరీష్ కూడా మా వాడిని అడిగాడు. కథ రెడీ చేసుకున్న తర్వాత శిరీష్ కు శ్రీరస్తు, శుభమస్తుతో హిట్ వచ్చింది. దాంతో మా వాడితో చేయనని చెప్పేశాడు శిరీష్. చివరకు నా కొడుకును హీరోగా పరిచయం చేద్దాం అనుకున్నా. కానీ వాడు వద్దని డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్లాడు. బింబిసారతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. వాడు చాలా కష్టపడ్డాడు’ అంటూ సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.