Rajamouli : రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. అది ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది రాజమౌళి మాత్రం ఓ మూడు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. ప్రస్తుతం ఫారిన్ లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టైమ్ లో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా ప్రేక్షకుడినే అని చెప్పారు. తాను కూడా కొన్ని సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకుంటానని అన్నారు.
Read Also : Sreeleela : శ్రీలీల మాస్ గ్రేస్.. ఆ అందాలు చూశారా..
ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా కోసం, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే సినిమా కోసం, అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఈ మూడు కాంబోలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని.. ఆ సినిమాలు ఎలా ఉంటాయో అనే ఆతృత తనకు కూడా ఉందన్నారు. దీంతో ఆయన కామెంట్స్ క్షణాల్లోనే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆయా సినిమాల హీరోల అభిమానులు తెగ ఖుషీ అవుతున్నాయి. పెద్ది గ్లింప్స్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్, నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అటు ప్రభాస్-సందీప్ మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు.