కన్నడ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన KGF సిరీస్ ఎంతటి ఘాన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ రెండు సిరీస్ తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్ లో సిక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా ఇప్పుడు దానికి సీక్వెల్ KGF-3 రాబోతుందని వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించనున్నాడని, KGF సీరిస్ లో భాగంగా అజిత్ కుమార్ తో ప్రశాంత్ రెండు భాగాలను తెరకెక్కించబోతున్నాడని తమిళ మీడియా వార్తలు వండి వడ్డిస్తోంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ కావడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. అలాగే సలార్ ఉండనే ఉంది. వీటికే రెండు, మూడు ఏళ్ళు పడుతుంది. ఇక అజిత్ తో సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తాడో ఎటువంటి క్లారిటీ లేదు.