SC Categorization: నేడే ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SC Categorization: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ వర్గీకరణ అమలుకు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఎంపిక చేసుకోవడం విశేషం. గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలంగా, ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఈ ఉపసంఘ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించగా.. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్షితిజ్ మరికొందరు పాల్గొన్నారు.
Also Read
- Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
- Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
- Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని.. అయితే, రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5 శాతానికి పెరిగిందని అన్నారు. అదేవిధంగా, ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్ అమలు చేయాలన్న సూచనను ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే, జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వంకు అందించింది. ఇందులో మొత్తం 59 ఎస్సీ కులాలపై వివరణాత్మకంగా విశ్లేషణ ఉంది. 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టిన ఈ కమిషన్ అతి కొద్దీ రోజుల్లో ఈ నివేదికను సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా బహిరంగ విచారణలు, పర్యటనలు ద్వారా ప్రజల నుంచి వచ్చిన 4,750 విజ్ఞప్తులతో పాటు.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన 8,681 వినతులను పరిశీలించి పూర్తి నివేదిక రూపొందించారు. ఈ నివేదికలో 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు అధికారులు.
ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన కులాలు (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం పరంగా), గ్రూప్-2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధిపొందిన కులాలు, గ్రూప్-3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య న్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రయోజనాల పంపిణీలో సమతుల్యత తీసుకురావడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
US Birthright Citizenship Row: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
ట్రెండింగ్
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!