ప్రజంట్ ప్రేక్షకుల ఆలోచనా తీరు మారిపోయింది. వారు ఎలాంటి సినిమాలు ఇష్టపడున్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అటర్‌ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. యంగ్ హీరోలకు మాత్రం ఇది పెద్ద సవాల్‌గా మారింది. లవ్ స్టోరీ, యాక్షన్ మూవీ ఇలా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ హీరో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఖుషి, ఫ్యామిలి స్టార్ వంటి సినిమాలతో వచ్చినప్పటికి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ ప్రజంట్ ‘కింగ్డమ్’ మూవీతో రాబోతున్నాడు.
టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ భారీ చిత్రం లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పై ప్రస్తుతం పలు రూమర్స్ వైరల్‌గా మారాయి. ఏంటీ అంటే.. ఈ మూవీని మేకర్స్ మే 30 రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ అనుకున్న డేట్‌కి ఈ మూవీ రావడం లేదని పోస్ట్ పోన్ అయినట్టు ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. దీంతో కింగ్డమ్ రిలీజ్ విషయంలో విజయ్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఎలా అయిన రిలీజ్ డేట్ పై క్లారిటీ కోరుకుంటున్నారు. మరి ‘కింగ్డమ్’ మేకర్స్ కన్ఫర్మ్ చేస్తారా లేదా చూడాలి.