Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఫస్ట్ టైమ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. అందులో ఆమె చాలా డెప్త్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి ఈ సినిమా చాలా డిఫరెంట్ కథతో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. నేడు కీర్తి సురేష్ బర్త్ సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె నీడలా కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులోని డైలాగులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
Read Also : Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
ఆమె ప్రేమ ఓ కావ్యం లాంటిది. ఆమె ఆత్మ ఒక పాట లాంటిది అంటూ రాసుకొచ్చారు. దీన్ని బట్టి కీర్తి సురేష్ పాత్ర ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కీర్తి సురేష్ ఏ సినిమా చేసినా అందులో తన పాత్ర చాలా బలంగా ఉండేలా చూసుకుంటోంది. నటనకు స్కోప్ ఉన్న పాత్రమే ఆమె చేస్తుంది. ఈ లెక్కన విజయ్ తో చేస్తున్న సినిమాలో కూడా ఆమె పాత్ర చాలా డెప్త్ ఉంటుందని అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలకు ఆమె గ్యాప్ ఇవ్వకుండా వరుసగా నటిస్తూనే ఉంది. కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా విజయ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.
Read Also : Raghava Lawrence : నడవలేని స్థితిలో రాజమౌళి సినిమా ఆర్టిస్టు.. ఆదుకున్న లారెన్స్
Her love is poetry, her soul is the song ❤️
Team #SVC59 wishes the Phenomenal @KeerthyOfficial, a very Happy Birthday! 🌸
Get ready to witness her magic unfold in this epic collaboration 💫@TheDeverakonda @storytellerkola #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off… pic.twitter.com/vjShBBokuF
— Sri Venkateswara Creations (@SVC_official) October 17, 2025