2025 సంక్రాంతికి మరోసారి పెద్ద, చిన్న సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు కర్చీఫ్ వేసాయి. ఎలాగైనా సంక్రాంతికి వచ్చేలా షూటింగ్ చక చక చేస్తున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక పొంగల్ కు వస్తున్నా మరో స్టార్ వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ కు జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతికే మొగ్గు చూపుతున్నారు.
Also Read : Hitler : హిట్టు కోసం పట్టువదలని “హిట్లర్”లా విజయ్ ఆంటోనీ .. ఈసారైనా దక్కేనా..?
ఇక ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో సినిమా స్టార్ హీరోలతో పోటీ పడేందుకు సిద్దమయింది. ఇటీవల రాయన్ సినిమాలో ప్రశంసలు అందుకున్న సందీప్ కిషన్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ కోవలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఫుల్ స్వింగ్ లో లాంగ్ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా నాన్ థియేటర్ బిఙినెస్ 22 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది ఇకారకంగా చెప్పాలంటే
సందీప్ కెరీర్ హయ్యస్ట్. దీనితో పాటుగా రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, నాగార్జున బంగార్రాజు -3 కూడా ఫెస్టివల్ రేస్ లో ఉన్నాయి.