Hitler : హిట్టు కోసం పట్టువదలని “హిట్లర్”లా విజయ్ ఆంటోనీ .. ఈసారైనా దక్కేనా..?
- వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్న విజయ్ ఆంటోని
- నెలకొక సినిమాతో టాలీవుడ్ పై విజయ్ దండయాత్ర
- పాన్ ఈ దఫా పాన్ ఇండియా సినిమాగా వస్తున్న హిట్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా “హిట్లర్”తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో “విజయ్ రాఘవన్” అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా “హిట్లర్” సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. “హిట్లర్” సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. “హిట్లర్” సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Also Read : Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్..
Also Read
“హిట్లర్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్ లో రివీల్ చేశారు. దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో “హిట్లర్” ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పర్ ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్ లో “హిట్లర్” మరో వైవిధ్యమైన చిత్రంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?