కోలీవుడ్ తోపు, తురుమ్ డైరెక్టర్స్‌గా బిల్డప్ క్రియేట్ చేసుకున్న కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనగరాజ్ ఈ ఏడాది తమిళ తంబీల ఎక్స్ పెక్ట్ చేసిన నంబర్స్ ఇవ్వలేకపోయారు. కార్తీక్ సుబ్బరాజ్ అయితే రెండు రకాలుగా చెడ్డాడు. దర్శకుడిగానే కాదు రచయితగా కూడా ఫెయిలయ్యారు. కథ అందించిన గేమ్ ఛేంజర్ అటు రామ్ చరణ్ ఖాతాలో ఫ్లాప్‌గా మారితే శంకర్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక రెట్రోతో సూర్యపై ప్రయోగం చేశాడు కానీ సరిగ్గా ఫలించలేదు. డివైట్ టాక్ తెచ్చుకోవడంతో కార్తీక్ సుబ్బరాజ్ మొహం మాడిపోయింది.
Also Read : Akhanda2 : అఖండ ప్రీమియర్ షో పై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషన్
మల్టీస్టార్లర్స్‌తో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. బొమ్మ రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ నంబర్స్ చూసి రజనీకి కూడా ఎక్కకపోవడంతో తలైవర్ 173కి దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్‌ని తీసి పక్కన పెట్టారు. ఇటు కార్తీ కూడా ఖైదీ2 కోసం గ్యాప్ ఇస్తుండటంతో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు లోకేశ్. దర్శకులుగా వీరికి అవకాశాలు రాకపోవడంతో పోయిన పరువును నిలబెట్టుకునేందుకు స్టార్ డైరెక్టర్స్ చేతులు కలుపుతున్నారు. నిర్మాతలుగా కొలబరేట్ అవుతున్నారు. ఈ ఇద్దరు కలిసి తమిళంలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేశ్ ప్రొడక్షన్ హౌస్ జీ స్క్వాడ్, కార్తీక్ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్, ’29’ అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి ఆస్రానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకుడు. నెక్ట్స్ మార్చిలో మూవీ రిలీజయ్యే అవకాశాలున్నాయి. మరి దర్శకులుగా ఫెయిలైన ఈ ఇద్దరు నిర్మాతలుగా గట్టెక్కుతారో లేదో తేలాలంటే నెక్ట్స్ స్ప్రింగ్ సీజన్ వరకు ఆగాల్సిందే.