Hamsa Nandini: ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం.. అదే ప్రాణం తీసే జబ్బుతో పోరాటం చేయాల్సి వస్తే.. తగ్గిపోతుంది అని నమ్మడానికి కూడా లేని వ్యాధి బారిన పడితే.. అన్నిటిని వదులుకొని.. జీవితం కోసం పోరాటం చేయాల్సి వస్తే.. వారికన్నా జీవితం గురించి ఇంకెవరికి తెలియదు. ఎంతో మనో ధైర్యంతో బతకడానికి వారు చేసిన పోరాటం మాటల్లో వర్ణించలేనిది. అదే విషయాన్ని చెప్పుకొచ్చింది నటి హంసా నందిని. కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. రేపు మహిళా దినోత్సవం.చావు అంచుల వరకు వెళ్లి మానసికంగా దృడంగా ఉండటంతో పాటు చావుతో పోరాటంచేసివచ్చిన ఆమె కథ ఎంతో మందికి ఆదర్శం. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కథను వివరించింది.
Off The Record: ప్రకాష్‌రాజ్ ఏమైపోయారు..? ఎన్నికల్లో పోటీ చేస్తారా?
“కరోనా లాక్డౌన్ తర్వాత నా సినిమా షూటింగ్‌ను ప్రారంభించాను. జూలై 2020లో సెట్ లో ఉండగానే నాకు గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యినట్లు తెలిసింది. మా ఇంట్లో అంతకుముందే ఒక క్యాన్సర్ పేషేంట్ ఉన్నారు. ఆమె మా అమ్మ. 18 సంవత్సరాల క్రితం ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడింది.. కానీ ఓడిపోయింది. ఇక తల్లిని ఏ వ్యాధితో అయితే పోగొట్టుకున్నానో అదే వ్యాధి నాకు వచ్చిందని తెలిసి నేను పడిన భయం అంతాఇంతా కాదు. అది తెలిసాక మనసంతా గందరగోళం, భయం, నిద్రపట్టేది కాదు. హాస్పిటల్ లో స్కానింగ్ లు, టెస్ట్ లు ఇలా ఒకదాని తరువాత ఒకటి.. చివరికి ధైర్యంగా శస్త్రచికిత్స చేయించుకోవడానికి దైర్యం చేశాను. నా రొమ్ము నుంచి క్యాన్సర్ కణతి ని తొలగించారు. అంతేకాకుండా క్యాన్సర్ మొత్తం వ్యాపించకపోయినా 16 కీమోథెరపీ సెషన్స్ చేయించుకున్నాను. అయినా ఇక్కడితో ఇది అయిపోయిందని చెప్పలేను. ఎందుకంటే.. ఈ వ్యాధి నాకు వంశపారంపర్యం కింద వచ్చింది. ఇప్పటికీ అయితే కొద్దిగా ఉపశమనం ఉండొచ్చు కానీ, జీవితంలో మళ్లీ ఈ క్యాన్సర్ రావచ్చు. ఈ విషయాన్ని వైద్యులు తేల్చి చెప్పారు. జీవితాంతంలో మరో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 70% హామీ
ఉండడంతో ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక మార్గం చాలా ఇన్వాసివ్ ప్రొఫిలాక్టిక్ సర్జరీలు, గత సంవత్సరం చేయించుకున్నాను” అని చెప్పుకొచ్చింది.
Urfi Javed: బావుంది సార్.. కొంచెం బట్టలు వేసుకుంటే ఇంకా బావుండేది
కఠినమైన చికిత్సలు మరియు సవాలుతో కూడిన రోగనిర్ధారణ ఉన్నప్పటికీ, హంసా తనకు తానుగా కొన్ని వాగ్దానాలు చేసుకుంది. వ్యాధి తన జీవితాన్ని నిర్వచించనివ్వకుండా, చిరునవ్వుతో పోరాడుతూ, తిరిగి తెరపైకి రావడం మరియు ఇతరులకు అవగాహన కల్పించడానికి మరియు ప్రేరేపించడానికి తన కథను చెప్పడం చేస్తూ వస్తుంది. ఇప్పటికి తనకు ఈ వ్యాధి సోకి ఏడాదిన్నర కావొస్తోంది. ఆమె చెప్పినట్లుగానే పెదవుల మీద చిరునవ్వును వదలకుండా సంతోషంగా జీవిస్తోంది. గతేడాది నవంబర్‌లో హంస సినిమా షూటింగ్ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టింది. ఇక మొదటి రోజు షూటింగ్ గురించి ఆమె మాట్లాడుతూ.. నిజంగా మళ్లీ ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎంతో భయపడ్డాను.. కనై కెమెరా చూడగానే వాటిని అన్ని మర్చిపోయాను. ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇంత బాధను అనుభవించినా ఆమె చిరునవ్వు ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ఒక యోధురాలు. నిజమైన మహిళా దినోత్సవ మోటివేషన్. ఆమె బలం మరియు సంకల్పం మనందరికీ అన్ని అసమానతలతో పోరాడటానికి మరియు మన జీవితాలను సంపూర్ణంగా జీవించడానికి ప్రేరేపిస్తుంది.