Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి ఫ్యాషన్ కు పిచ్చెక్కి కొట్టుకుంటున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. కళకు ఏది కాదు అనర్హం అన్నట్లు.. నా డ్రెస్సింగ్ కు ఏది కాదు అనర్హం అని ఉర్ఫీ నిరూపిస్తోంది. ప్రైవేట్ భాగాలను మాత్రమే దాస్తూ మిగతా దేహాన్ని గాలికి వదిలేస్తోంది. అయితే ఇలా ఉండడం వలనే నేను ఫేమస్ అయ్యా.. డబ్బు సంపాదిస్తున్నా.. అందరు నన్ను గుర్తుపడుతున్నారు అని మొహమాటం లేకుండా మీడియా ముందు చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. దీంతో అమ్మడి ఆహార్యానికి విమర్శలు చేయడం తప్ప ఆమెను ఏం చేయడానికి లేదు. అందులో కూడా ఎవరు ఎన్ని అయినా అనుకోండి.. నాకేం సంబంధం లేదు అన్నట్లు ఉర్ఫీ రోజుకో కొత్తరకం ఫ్యాషన్ తో బెంబేలెత్తిస్తోంది.
Oscar 2023: ఆస్కార్ లైవ్.. ఆర్ఆర్ఆర్ కు అవార్డు రాకపోతే టీవీలు పగిలిపోవుడే
ఇక తాజాగా ఉర్ఫీ నేడు హోళీని పురస్కరించుకొనిఇంకో ఫ్యాషన్ డ్రెస్ తో అభిమానులను షాక్ చేసింది. ఆ డ్రెస్ ఎటునుంచి వేసుకుంటారో కూడా తెలియనట్లుంది. తెల్లటి బికినీ లా కనిపిస్తోంది.. కింద మోకాళ్ళ వద్ద పట్టి ఉంచే ఒక క్లాత్ కట్టుకుంది. అది కాళ్లకు అడ్డుపడుతూ ఉన్నా గెంతుకుంటూ నడుస్తోంది. ఇక ఎద భాగాన్ని ఎప్పటిలానే వదిలేసి కనిపించింది. ఇక ఈ డ్రెస్ చూసిన అభిమానులు ఏం చెప్పాలో తెలియక బావుంది సార్.. అరే నిజంగా బావుంది అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.