దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ పుతిన్, జిన్‌పింగ్‌లను ప్రశంసించారు. వారిద్దరితో మంచి సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
గ్రీన్లాండ్ విషయంలో సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై 200 శాతం సుంకం విధిస్తానని ఇటీవల ట్రంప్ బెదిరించారు. తాజాగా అధ్యక్షుడు మెత్తబడ్డారు. ఆ బెదిరింపును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్లో అల్లర్లు మొదలైన దగ్గర నుంచి ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. తామేమీ తక్కువ కాదంటూ ఇరాన్ కూడా ట్రంప్‌కు వార్నింగ్‌లు ఇచ్చింది.
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా ఈ దంపతులపై ఎన్నో పుకార్లు వచ్చాయి. కొద్దిరోజుల పాటు అంతర్జాతీయంగా వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ దంపతుల నుంచి మంచి శుభవార్త వచ్చింది.
ట్రంప్ హెచ్చరించినట్లుగానే గ్రీన్లాండ్లో ఉద్రిక్తతలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. అమెరికా సైన్యం గ్రీన్లాండ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచి అమెరికా సైనిక చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాదంతా సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో విమానం కొద్దిదూరం నేలకు రాసుకుంటూ వెళ్లి ఆగిపోయింది.
గ్రీన్లాండ్ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి లభించేంత వరకు యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్‌ను మిత్ర దేశాలు తీవ్రంగా ఖండించాయి.
నిన్నామొన్నటి దాకా ఇరాన్‌ను పదే పదే అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నారు. నిరసనకారుల్ని చంపడం ఆపకపోతే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తూ వచ్చిన ట్రంప్.. ఇప్పుడు స్వరం మారింది.