Gaza: ప్రస్తుతం గాజా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక రొట్టె కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి. ఆహార కొరతతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక తాజాగా ఆసుపత్రి పైన జరిగిన దాడిలో 500 మంది పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ గాజాకు అండగా నిలవనుంది. గాజాలో “స్థిరమైన” మానవతా సహాయ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈజిప్ట్ ప్రకటించింది. దీనిలో భాగంగా అవసరమైన సామాగ్రిని వందలాది ట్రక్కుల్లో గాజాకు తరలిస్తోంది ఈజిప్ట్. ఇప్పటికే ఈజిప్ట్ 20 ట్రక్కులను గాజాకు పంపిందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. అయితే.. రాఫా సరిహద్దు క్రాసింగ్ చుట్టూ ఉన్న రహదారికి మరమ్మతులు జరుగుతున్నాయి. దీనితో మానవతా సహాయ రవాణాకు శుక్రవారం వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
Read also:Medak: ఏడు పాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5 లక్షల 11 వేల నగదుతో అమ్మవారి అలంకరణ
కాగా మానవతా దృఖ్పదంతో గాజాకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటాం.. కానీ గాజా స్ట్రిప్ నుండి పెద్ద సంఖ్యలో శరణార్థులను ఈజిప్టులోకి ప్రవేశించడానికి మాత్రం అనుమతించం అని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్-సిసి పేర్కొన్నారు. అందుకే గాజా శరణార్థులు వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లు పొరుగున ఉన్న జోర్డాన్‌కు వెళ్తున్నారని అబ్దెల్ ఫత్తా అల్-సిసి బుధవారం తెలిపారు. బుధవారం సంఘీభావ ప్రదర్శనలో ఇజ్రాయెల్‌ను సందర్శించారు జో బిడెన్. హమాస్ నిర్వహిస్తున్న గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 500 మందిని చంపిన ఘోరమైన గాజా ఆసుపత్రి బాంబు దాడికి ఇస్లామిక్ జిహాద్ గ్రూపు కారణమని ఆరోపించారు.