గాజాలో రెండేళ్ల పాటు బాంబ్ దాడులతో దద్దరిల్లింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి కీలకమైన ఆమోదం లభించింది. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానానికి ఓటింగ్‌లో మెజారిటీ మద్దతు లభించిన తర్వాత 20 పాయింట్ల రోడ్‌మ్యాప్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన శాంతి చట్రంగా మారింది. ఈ ప్రతిపాదనలో అంతర్జాతీయ దళాలను మోహరించడం కూడా ఉంది. వాషింగ్టన్ 20-పాయింట్ల చట్రం గాజాలో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, పాలన కోసం మొదటి సమగ్ర అంతర్జాతీయ రోడ్‌మ్యాప్‌ను వివరిస్తుంది. Also…
గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి.
గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.
గాజాలో శాంతి వాతావరణం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయా దేశాధినేతలంతా ట్రంప్‌ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేశారు. తొలిసారి ట్రంప్‌ను బైడెన్ అభినందించారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం వేళ ఒక ఇజ్రాయెలీయుడు విషాదకరమైన నిర్ణయానికి తీసుకున్నాడు. ఇటీవలే రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తైంది. ప్రస్తుతం శాంతి ఒప్పందం జరిగింది. ఇలాంటి తరుణంలో ఒక ప్రియుడు మరణశాసనాన్ని రాస్తున్నాడు.
గాజాలో పాలన పాలస్తీనీయుల చేతుల్లోనే ఉండాలని హమాస్, పాలస్తీనా వర్గాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఏదైనా బాహ్య జోక్యాన్ని గానీ విదేశీయుల ఆదిపత్యాన్ని గానీ అంగీకరించబోమని పేర్కొంది.
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఇంకా నాశనం కాలేదని.. యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు.
గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని హమాస్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబ్ దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి హమాస్ ప్రకటించింది.