ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత…
Israeli–Palestinian conflict: పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాలని ఐక్యరాజ్యసమితి బుధవారం నాడు తీర్మానం చేసింది. ఇందు కోసం 12 నెలల పాటు గడువు ఇచ్చింది.
Egypt’s aid for Gaza: హమాస్ ఇజ్రాయిల్ పైన అతి క్రూరంగా దాడి చేసింది. ప్రజలు చంపొద్దని వేడుకున్న కనికరించలేదు. చిన్న, పెద్ద అని తేడా చూడలేదు, మహిళలు పురుషులనే తారతమ్యం లేకుండా విచక్షణ రహితంగా 1400 మందికి పైగా చంపేశారు. దీనితో ఇజ్రాయిల్ హమాస్ ను శిధిలం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే హమాస్ పాలనలో ఉన్న గాజా పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయిల్ దాడుల్లో 4500 మందికి పైగా మరణించారు. వందలమంది గాయపడ్డారు.…
Israeli–Palestinian conflict: ఇజ్రాయిల్ గాజా పైన చేస్తున్న ప్రతీకార దాడులు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ గాజా పైన కురిపిస్తున్న బాంబుల వర్షానికి గాజా అతలాకుతలం అయింది. దయనీయ స్థితిలో గాజా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్ ధాటికి హమాస్ దిగివచ్చింది. గాజా పైన చేస్తున్న బాంబుల దాడిని నిలిపివేస్తే హమాస్ అధీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలందరిని విడుదల చేస్తాం అని తెలిపింది. కాగా గాజా భూభాగంలో సంభవించిన విపత్తు నేపథ్యంలో మానవతా…
GAZA: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసి మారణహోమం సృష్టించింది. విచక్షణ రహితంగా చేసిన దాడుల్లో 1400 మందికి పైగా మరణించారు. అదే రోజు హమాస్ 200 మందికి పైగా బంధించింది. ఈ నేపథ్యంలో చంపడం మాకు వచ్చు అని నిరూపించింది ఇజ్రాయిల్. హమాస్ ఉగ్రవాదుల వికృత చేష్టలకు ఏ మాత్రం తీసిపోము అని గాజా పైన విరుచుకుపడింది. గాజా పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ హృదయ విదారక ఘటనలో 4500…
2023 Israel–Hamas war: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కారుచిచ్చు రగులుతుంది. ఇప్పటికే ఇరు దేశాలు విచక్షణ రహితంగా ఒకరి మీద ఒక్కరు విరుచుకు పడుతున్నారు. ఈ మారణహోమంలో వేలమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇలాంటి సమయంలో ఇతర దేశాలు మద్దతు ఇస్తూ యుద్ధంలో పాల్గొనడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త. వివరాలలోకి వెళ్తే.. ఓ అంతర్జాతీయ మీడియాతో ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త మరియు యురేషియా గ్రూప్…
Israeli–Palestinian Conflict: ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి అందరికి సుపరిచితమే. ఈ మారణహోమంలో అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా.. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతిస్పందన దాడిలో దాదాపుగా 3,500 మంది మరణించారు. ప్రస్తుతం గాజా పరిస్థితి దయానియ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఈజిప్టు మానవతా సహాయానికి ముందుకు వచ్చింది. అయితే జరుగుతున్న ఈ యుద్ధఖాండ పైన స్పందించిన అగ్రరాజ్యం అమెరికా…
Gaza: ప్రస్తుతం గాజా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక రొట్టె కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి. ఆహార కొరతతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక తాజాగా ఆసుపత్రి పైన జరిగిన దాడిలో 500 మంది పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ గాజాకు అండగా నిలవనుంది. గాజాలో “స్థిరమైన” మానవతా సహాయ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈజిప్ట్ ప్రకటించింది. దీనిలో భాగంగా అవసరమైన సామాగ్రిని వందలాది ట్రక్కుల్లో గాజాకు తరలిస్తోంది ఈజిప్ట్. ఇప్పటికే…