ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి ధర రూ.67,200గా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ బంగారం, వెండి ఇవే ధరలు పలుకుతున్నాయి.
Read Also: ఇంధన ధరల మంట… చోటా ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన గిరాకీ..!
అయితే దేశమంతా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గగా… దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,210గా నమోదైంది. కిలో వెండి ధర రూ.62వేలుగా ఉంది. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,320… 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,320గా పలుకుతోంది. సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.73 తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,030గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా ప్లాటినం ధర ఇదే విధంగా ఉంది.