Earthquake: పసిఫిక్ తీరంలో భారీ భూకంపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: పసిఫిక్ తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పనామాలోని పసిఫిక్ తీరంలోని బోకా చికా పట్టణానికి సమీపంలో మంగళవారం ఈ భూకంప వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం 5.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర బోకా చికాకు దక్షిణంగా 71 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Arunachal Pradesh: భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం.. చైనా పేరు మార్పులపై అమెరికా..
Also Read
అయితే భూకంపం వల్ల ఎంత నష్టం సంభవించిందనేది తెలియాల్సి ఉంది. అంతకుముందు మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. రాజధాని మనీలాకు 514 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతలో భూకంపం నమోదు అయింది. దీనికి ముందు పపువా న్యూగినియాలో కూడా భారీ భూకంపం వచ్చింది. 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు భయపడ్డారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.
ప్రస్తుతం భూకంపాలు సంభవించిన ప్రాంతాలు అన్ని పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో సముద్రం అంతర్భాగంలో అగ్నిపర్వాతాల యాక్టివిటీ అధికంగా ఉంటుంది. దీంతో పాటు టెక్టానిక్ ప్లేట్ల కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో తరుచుగా ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి.
తాజావార్తలు
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!