Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రైన్ లో నిప్పంటించి ముగ్గురు మరణాలకు కారణం అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు షారుఖ్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి పట్టుకున్నారు. మహరాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Assam MLA: తాజ్‌మహల్, కుతుబ్‌మినార్లను కూల్చేయండి.. మోడీ జీ
కేరళ ట్రైన్ అటాక్:
ఏప్రిల్ 2న రాత్రి 9.45 గంటల ప్రాంతంలో అలపూజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. ఈ ఘటనలో 8 మందికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటన తర్వాత ఏడాది వయసు ఉన్న చిన్నారి, ఒక మహిళతో పాటు ముగ్గురు రైలు నుంచి తప్పిపోయారు. అదే రోజు వీరంతా ఎలత్తూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై శవాలుగా కనిపించారు. బోగీలో మంటలు వ్యాపించడంతో భయంతో వీరంతా దూకి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేరళ పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణాన్ని కొట్టి పారేలేయమని కేరళ డీజీపీ అనిత్ కాంత్ అన్నారు. నిందితుడికి సంబంధించి స్కెచ్ ను పోలీసులు విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్, నోయిడా, ఘజియాబాద్, హర్యానాల్లో పలు ప్రాంతాల్లో నిందితుడి కోసం సోదాలు నిర్వహించారు.
నిందితుడు దొరికిందిలా..
రైలులో తోటి ప్రయాణికులకు నిప్పటించిన తర్వాత నిందితుడు షారుఖ్ సైఫీ పరారీలో ఉన్నాడు. మంగళవారం మహారాష్ట్ర రత్నగిరిలో అతడి ఆచూకీని నిఘా బృందాలు కనిపెట్టాయి. రైలులో నిప్పు పెట్టిన తర్వాత రైలు నుంచి కింద పడటంతో అతడి తలకు గాయాలై రత్నగిరి సివిల్ ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స పూర్తికాకముందే అక్కడి నుంచి పారిపోయాడు. రత్నగిరి ప్రాంతంలో సోదాలు నిర్వహించగా నిందితుడు దొరికాడు.