టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అలానే కొన్ని అనవసరమైన వివాదాలల్లోను శివాజీ పేరు వినిపిస్తోంది. శివాజీ ముఖ్యపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ధండోరా’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
Also Read : JanaNayagan : జననాయగన్.. తెలుగు రైట్స్ నాగవంశీ నుండి.. దిల్ రాజు చేతికి
ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు సినిమా ఈవెంట్స్ తో పాటు బయటకు వచ్చే సమయంలో వారు ధరించే దుస్తుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివాజీ మాట్లాడుతూ’ అమ్ముయిలు, హీరోయిన్స్ ఏవంటే ఆ బట్టలు వేసుకుంటే మనమే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఒకవేళ అనుకున్న నేను పట్టించుకోను, కానీ మీ అందం చీరలోను మీరు నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్ప సామాన్లు కనిపించేలా వేసుకునే డ్రెస్ లో ఏమి ఉండదు. అలా వేసుకున్నప్ప్పుడు చాలా మంది చూసి నవ్వుతారు తప్ప మనసులో తిట్టుకుంటారు. ఆ సమయంలో తిట్టాలని ఉన్న తిట్టలేము ఏమైనా అంటే స్త్రీ స్వతంత్రం అని అంటారు. అసలు స్త్రీ అంటే ప్రకృతి.. ఎంత అందంగా ఉంటె అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. ఒకప్పట్లో సావిత్రి, సౌందర్య ఎంత చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రక్ష్మిక ఎంత చక్కగా బట్టలు ధరిస్తుంది. గ్లామర్ అనేది ఒకదశ వరకు ఉండాలి, హద్దులు మీరి ఉండకూడదు. స్వేచ్ఛ అనేది అదృష్టం దాన్ని కోల్పోవద్దు. మన వేషబాషలతోనే మనకు గౌరవం పెరుగుతుంది. విశ్వసుందరి వేదికల మీద కూడా చీర కట్టుకున్న వారికే కిరిటాలు వచ్చాయి’ అని అన్నారు.తన మాటల్లో, “సరైన సందర్భానికి తగ్గట్టుగా దుస్తులు ధరిస్తే ఒక సహజమైన అందం, ఆకర్షణ కనిపిస్తుంది” అని శివాజీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సామాన్లు కనపడేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదు
:- Actor #Shivaji #Dhandoraapic.twitter.com/eJHxBx3fgv
— Milagro Movies (@MilagroMovies) December 22, 2025